ఆనందం అంచులు దాటి వెళ్ళినపుడు కలిగే అనుబుతి వర్ణించటానికి వీలుకానిది .అందమైన జీవితం అందరికి దొరకకపోవచ్చు .కానీ విషాదం అందరి జీవితంలో తొంగి చూస్తుంది.నా మనసు మౌనంతో మెరిసిన క్షణం లో అన్ని ఆనందంగానే కనిపించాయి.కానీ బాధలు కలిగిన సమయంలో బయంతో బ్రతుకు భారంగా మారింది.నిలువ నీడ లేని నీడ కూడ నన్ను చూసి ఎగతాళి చేసింది.కాలం కనిపించకుండా కనుమరుగవుతుంది .వాస్తవాలు ఊపిరి పోస్తాయేమో  అనుకున్న కాని న్యాయం లేని ఈ ప్రపంచంలో నాలాంటి అమాయకురాళ్ళు అడుగంటిపోవటమే తప్ప మరో మార్గం లేదు అనుకుంట !